డిసెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త ... దర్శనం, సేవలు, గదుల కోటా వివరాలివే!

తిరుమల శ్రీవారిని రానున్న డిసెంబర్‌లో దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవలు, వృద్ధులు-దివ్యాంగుల దర్శన టోకెన్లు, తిరుమల-తిరుపతిలో వసతి గదుల కోటా వివరాలు తెలుసుకోండి.

12 సెప్టెంబర్, 2026 3:08 PM•ByNarender Kumar Nangunoori

Share this article

డిసెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త ... దర్శనం, సేవలు, గదుల కోటా వివరాలివే!

Thiruma Sri Venkateshwara Swamy Temple

తిరుమల,సెప్టెంబర్ 12 (జనవాణి): తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి 24 వరకు దశలవారీగా టికెట్లు, టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

సెప్టెంబర్ 19న ఆర్జిత సేవల కోటా

డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సెప్టెంబర్ 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 22న పలు సేవల టికెట్లు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానుంది.

సెప్టెంబర్ 23న ప్రత్యేక కోటాల విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్లను సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా

డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు