నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా...రంగం భవిష్యవాణిలో షాకింగ్ హెచ్చరికలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

3 ఆగస్టు, 2026 12:52 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా...రంగం భవిష్యవాణిలో షాకింగ్ హెచ్చరికలు

Janavaani Image

తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అత్యంత కీలక ఘట్టమైన 'రంగం' కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆషాఢ మాసం లష్కర్ బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని రెండో రోజైన నేడు (ఆగస్టు 3)ఆదివారం తెల్లవారుజామునే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ నృత్యాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

జాతరలో అత్యంత పవిత్రంగా భావించే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తన విగ్రహ ప్రతిష్ఠపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అయినప్పటికీ ప్రజలను తాను కాపాడుతూనే ఉన్నానని పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చినా.. ప్రమాదం వచ్చినా కాపాడుతున్నా. అయినా నా మాట మీరు ఆచరించటం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరు అడ్డుపుల్ల వేసినా నేను ఊరుకోను. జనాలు వావివరసలు మరిచి ప్రవర్తిస్తుంటారు. మీరు ఘోరాలు చేస్తుంటే.. ప్రమాదాలు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటాయి. వాళ్లను నేను మాత్రం వదలిపెట్టను. ఈ ఏడాది బాధగా, ఇబ్బందిగా ఉంది. సంతోషం లేకుండా చేస్తున్నరు. మీకు అహంకారం ఎక్కువైపోతుంది. ఈ ఏడాది కూడా కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. జనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా అంటూ స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు