రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.
ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ కోడలు రాధిక మర్చంట్ ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు చేసిన అద్భుత నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ వింత అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఒంటిపై నిప్పులు పోసినట్లు మంటలు రావడంతో రోజంతా చెరువులోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. బాలుడిని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించి, సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు.