కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనిపించకుండా తిరుగుతున్న భర్త.. చివరకు తన కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యకు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం రావాల్సిన ఇండిగో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. మరోవైపు దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
Annavaram | అన్నవరం అంటేనే సత్యనారాయణ స్వామి.. రత్నగిరి అంటేనే భక్తుల కొంగుబంగారం. ప్రకృతి రమణీయతల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ శుద్ధ విదియను పురస్కరించుకుని జరిగే సత్యదేవుని ఆవిర్భావోత్సవానికి ప్రత్యేకత ఉన్నది. స్వామివారు వెలసిన పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ నిర్వహించే ఈ వేడుకల్లో రత్నగిరి భక్తిసంద్రంగా మారుతుంది. వేదఘోషలు.. మంగళవాయిద్యాలు.. ప్రత్యేక అభిషేకాలు, పూజలు.. సత్యదేవుని నామస్మరణతో కొండంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.