థాయ్‌లాండ్ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు..ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

7 ఆగస్టు, 2026 2:32 PM•ByNarender Kumar Nangunoori

Share this article

థాయ్‌లాండ్ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు..ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకాక్ సమీపంలోని డెబ్సిరిన్ నొంతబురి పాఠశాలలో శుక్రవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ 14 ఏళ్ల విద్యార్థి విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

కాల్పుల అనంతరం నిందిత విద్యార్థి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు డెస్క్‌ల కింద దాక్కోగా, మరికొందరు బయటకు పరుగులు తీశారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించాయి. మరోవైపు తమ పిల్లల సమాచారం కోసం స్కూల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంట్లో మరో ఇద్దరి మృతదేహాలు

ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందిత విద్యార్థి నివాసంలో అతడి గ్రాండ్‌పేరెంట్స్ మృతదేహాలు లభించాయని పోలీసులు తెలిపారు. స్కూల్‌కు వెళ్లే ముందు వారిని కూడా హత్య చేసి ఉండొచ్చనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. ఘటనలో ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్‌గన్ అతడి తాతకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు