11 ఏళ్లుగా మనసులో దాచుకున్న వంట వ్యాపార కలను చివరకు నిజం చేసుకున్నారు తిరువనంతపురానికి చెందిన అనిజ. ఉద్యోగం చేస్తూనే అరిటాకులో బిర్యానీ విక్రయిస్తూ కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో రోజుకు ఐదారు ప్యాకెట్లు మాత్రమే అమ్ముడవగా.. ఓ యూట్యూబ్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు రోజుకు సుమారు 50 ప్యాకెట్ల వరకు విక్రయిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ ప్రతిపాదనను సీఎం సి. జోసెఫ్ విజయ్ ముందుంచగా, ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, పరిశుభ్రత, ఆహార భద్రత, తయారీ, సరఫరా వంటి అంశాలను పరిశీలించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో బిర్యానీ తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కూడా అనారోగ్యానికి గురికాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.