రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మూసీ పాత వంతెనపై నుంచి గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. అయితే కొద్దిసేపటికే సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత ప్రతిమను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని అగాపురాలో ఏర్పాటు చేసిన వినూత్న గణపతి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తెలంగాణ రైజింగ్–1000 డేస్ యాజ్ సీఎం’ థీమ్‌తో రూపొందించిన ఈ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రతిమ ‘బాహుబలి’ సినిమాలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని తలపిస్తోంది.