అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గి కిలోకు రూ.2.50 లక్షలకు చేరాయి.
కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ ప్రకారం ఢిల్లీ, ముంబై మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,420 మేర పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది.
దేశంలో బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. శుక్రవారం గుడ్ రిటర్న్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,980గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1,52,830గా నమోదైంది. ఇక వెండి ధరలు కిలోకు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉన్నాయి.