Gold Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో ఇటీవలి కాలంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. పసిడి ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండగా.. వెండి ధర కూడా కిలోకు రూ.2.50 లక్షలకు చేరువైంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో బంగారం ధరలు: దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,40,240గా నమోదైంది.
ముంబైలో గోల్డ్ రేట్లు: ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,52,830గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,090గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,090గా నమోదైంది.
వెండి ధరలు: ఇక వెండి విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,49,900గా నమోదైంది.
బంగారం, వెండి ధరలు నగరం, సమయం, మార్కెట్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఆభరణాల కొనుగోలు సమయంలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు తదితరాలు అదనంగా వర్తించవచ్చు.























