తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా జర్నలిస్టులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరోగ్య పథకం హామీ అమలు కాకపోవడం విచారకరమని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కోరారు
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నాయకులు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. "ఛలో పార్లమెంట్" పిలుపుతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పాత్రికేయులు కేంద్ర ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.