కేసీఆర్ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను 1,000 ఎకరాలుగా పేర్కొన్న రేవంత్.. ఇప్పుడు కేసీఆర్ దంపతులకు 67.13 ఎకరాలు ఉన్నట్లు సభలో చెప్పడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ఆస్తులపై, ప్రభుత్వ పెద్దల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను సభలో వెల్లడించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెయ్యి డప్పులతో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు బయలుదేరడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.