ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మళ్లీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది.