ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మళ్లీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని శాసనసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఈ విషయాన్ని మంత్రికి చెబితే ‘కూల్ కూల్’ అంటున్నారని, ప్రభుత్వ పెద్దలు కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని విమర్శించారు.