హైదరాబాద్ పహాడీషరీఫ్ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.
హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.
హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పెరోల్‌పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగాడు. ఈ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 ఏళ్లు పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడమే కాకుండా, పదవీ విరమణ అనంతరం పెన్షన్ కూడా తీసుకున్నాడు. చివరకు వరంగల్ సెంట్రల్ ప్రిజన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు.