Stories tagged with #Lucky Draw

news,telangana
‘నా కోసం ఆగరా?’.. అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం సీరియస్
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చేలోపే అధికారులు డ్రా ప్రారంభించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

news,telangana
ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రాలో అద్భుతం.. టోకెన్ తీసిన బాలుడి కుటుంబానికే ఫ్లాట్
హైదరాబాద్ ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు లక్కీడ్రాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవుపల్లి పరిధిలో ఓ బాలుడు లక్కీడ్రా టోకెన్ తీయగా.. అదే టోకెన్ అతడి కుటుంబానికి రావడంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది. జరపుల లక్ష్మీ కుటుంబానికి సొంతింటి అదృష్టం దక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

news,telangana
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్.. 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా
హైదరాబాద్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫ్లాట్ పొందిన వారికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని, పదేళ్ల తర్వాత అవసరమైతే ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.