వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో గట్టిగా సమాధానం చెప్పిస్తామని వ్యాఖ్యానించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్‌లో రాష్ట్ర రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ ప్రకటించారు. MGMలో మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు రానున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.