వరంగల్‌ను అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

4 ఆగస్టు, 2026 1:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వరంగల్‌ను అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, ఆగస్టు 04: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతి, మహాత్మాగాంధీ హాస్పిటల్ (MGM), ప్రభుత్వ కంటి ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC), వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సహా ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సేవల విస్తరణ, ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంపు, ఆధునిక వైద్య పరికరాల అందుబాటు, నిర్మాణ పనులను వేగవంతం చేయడం వంటి అంశాలపై మంత్రులు అధికారులతో విస్తృతంగా చర్చించారు.

వరంగల్‌ను రాష్ట్రంలోనే అత్యాధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు