హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్ హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక వివరణ ఇచ్చింది. మహిళపై దాడి చేసింది రైల్వే పోలీసు కాదని, తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు అని స్పష్టం చేసింది. ఘటనపై సీరియస్ అయిన డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో హోంగార్డును సర్వీసు నుంచి తొలగించగా, మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్, ‘ఢీ-20’ విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని, వివిధ అవసరాల పేరుతో సుమారు రూ.12 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.