పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు నల్లగొండ జిల్లాకు చెందిన వలిగొండ నరసింహ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే చదువును కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. డాక్టరేట్ అందుకున్న స్థానానికి ఎదిగారు.
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేయగా.. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ల్గొండలో ప్రిన్సిపల్ దారుణ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్
27 కత్తిపోట్లు.. ప్రిన్సిపల్ హత్య వెనుక టెన్త్ విద్యార్థులేనా?
స్కూల్‌కు వస్తూనే ఉన్నారు.. కానీ హత్య కేసులో అనుమానితులుగా విద్యార్థులు
రూ.4 లక్షల కోసమే హత్య చేశారా?.. ప్రిన్సిపల్ కేసులో పోలీసుల దర్యాప్తు
80 మందిని విచారించిన తర్వాత కీలక మలుపు.. ముగ్గురు విద్యార్థులపై అనుమానం