సినీ తారలు తమకున్న ప్రజాదరణను సామాజిక బాధ్యతతో వినియోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించే ముందు పలుమార్లు ఆలోచించాలని అన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
పాన్ మసాలా ఉత్పత్తిని ప్రకటన ద్వారా ప్రోత్సహించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై FDA కమిషనర్ తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు కావడం వల్ల చట్టానికి అతీతులు కాదని, నిషేధిత ఉత్పత్తిని ప్రోత్సహించిన వారిపైనా బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న పాన్‌మసాలా, పొగాకు తయారీ కేంద్రంపై సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.76 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని, కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు.