స్టార్లు కావచ్చు.. కానీ చట్టాన్ని ఉల్లంఘించారు: బాలీవుడ్ హీరోలపై ఎఫ్‌డీఏ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

పాన్ మసాలా ఉత్పత్తిని ప్రకటన ద్వారా ప్రోత్సహించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై FDA కమిషనర్ తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు కావడం వల్ల చట్టానికి అతీతులు కాదని, నిషేధిత ఉత్పత్తిని ప్రోత్సహించిన వారిపైనా బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.

18 సెప్టెంబర్, 2026 12:34 PM•ByNarender Kumar Nangunoori

Share this article

స్టార్లు కావచ్చు.. కానీ చట్టాన్ని ఉల్లంఘించారు: బాలీవుడ్ హీరోలపై ఎఫ్‌డీఏ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

ముంబై,సెప్టెంబర్ 18 (జనవాణి): పాన్ మసాలా యాడ్ వివాదం బాలీవుడ్ స్టార్లను చుట్టుముట్టింది. ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లు ఓ పాన్ మసాలా కంపెనీ ప్రకటనలో నటించడంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే తీవ్రంగా స్పందించారు.

ఓ వార్తా చానెల్‌తో మాట్లాడిన తుకారాం ముండే ఆ ముగ్గురు నటులు స్టార్లు కావచ్చని, అయితే తన దృష్టిలో వారు చట్టాన్ని ఉల్లంఘించిన వారేనని పేర్కొన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఇందుకు కారణమని తెలిపారు.

ఇద్దరి నుంచి మాత్రమే స్పందన

గత నెల 11న షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తుకారాం ముండే వెల్లడించారు. 15 రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని గడువు విధించినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ముగ్గురిలో ఇద్దరు నటులు మాత్రమే నోటీసులకు సమాధానం ఇచ్చారని, మరో నటుడు స్పందించలేదని చెప్పారు.

ఎండార్స్ చేస్తే బాధ్యత ఉండదా?

తమపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన నటులు ఒక ఉత్పత్తిని ప్రచారం చేసినా దాని బాధ్యత కంపెనీదేనని వాదించినట్లు తుకారాం ముండే తెలిపారు. అయితే ఈ వాదనను ఆయన తోసిపుచ్చారు.

FDA చట్టం ప్రకారం ఒక కంపెనీ ఉత్పత్తిని ప్రోత్సహించే వ్యక్తులపైనా బాధ్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో సంబంధిత పాన్ మసాలా ఉత్పత్తి వినియోగం, ప్రచారంపై నిషేధం ఉన్నందునే చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు