సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'డేవిడ్ రెడ్డి’లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో ఆమె కత్తి పట్టుకుని రక్తపు మరకలతో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
'బాహుబలి' సినిమాలో శివగామి చేతుల్లో కనిపించిన చిన్న మహేంద్ర బాహుబలి సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లముందు మెదులుతూనే ఉంటుంది. అయితే తెరపై అబ్బాయిగా కనిపించిన ఆ చిన్నారి నిజానికి అక్షిత వాల్సలాన్ అనే అమ్మాయి. కేరళకు చెందిన ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
సినీ ఇండస్ట్రీలో ఒకే హీరోతో ముందుగా హీరోయిన్‌గా నటించి, ఏళ్ల తర్వాత అదే హీరోకు తల్లి పాత్రలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్‌లో మహేష్ బాబు కెరీర్‌లో అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే.. సమాధానం రమ్యకృష్ణ.