కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట.. రెండు దశాబ్దాల తర్వాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సుదీర్ఘ పోస్ట్ చేశారు.
సూర్య హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు ప్రివ్యూ షో పడటంతో ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన వారి నుంచి ప్రాథమికంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని టాక్ వినిపిస్తున్నా.. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరిగి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా సూర్య, మమితా బైజు కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ప్రివ్యూ టాక్ చెబుతోంది.