ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అవమానం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. దళితులపై రేవంత్‌కు అంత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభలో నిరసనకు దిగిన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
సనత్‌నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు సిద్ధమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.