దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సీఎంగా చేయండి: తలసాని

దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అవమానం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. దళితులపై రేవంత్‌కు అంత ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు.

10 సెప్టెంబర్, 2026 6:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సీఎంగా చేయండి: తలసాని

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనవాణి): దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అవమానం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దళితులపై రేవంత్ రెడ్డికి నిజంగా అంత ప్రేమ ఉంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ బయట స్పీకర్ పరిధి ఉండదని తలసాని పేర్కొన్నారు. తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదించారని ఆరోపించారు. స్పీకర్‌ను తాతా మధు అవమానించినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభ్యులంతా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు.

‘దళితుడు’ అని పదేపదే చెప్పడంతోనే తెలిసింది

గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్‌కు కూడా గౌరవం ఉందని తలసాని అన్నారు. ఆయనను బీఆర్ఎస్ ఎప్పుడూ కేవలం దళిత స్పీకర్‌గా చూడలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే ‘దళిత స్పీకర్’ అని ప్రస్తావించడంతోనే రాష్ట్ర ప్రజల్లో చాలామందికి ఆయన దళితుడనే విషయం తెలిసిందని వ్యాఖ్యానించారు.

ప్రసాద్ కుమార్‌ను సీఎంగా చేయాలి

దళితులపై తనకు ప్రేమ ఉందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్‌ను వెంటనే ముఖ్యమంత్రిగా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తలసాని డిమాండ్ చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్‌ను సీఎంగా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరుతున్నానని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు