Stories tagged with #Telangana It

news,politics,telangana

politics,telangana
Future Cityలో కొత్త డేటా సెంటర్లు?.. తెలంగాణ డిజిటల్ ప్లాన్‌పై కీలక భేటీ
తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని బృందంతో సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్లు, AI, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఉద్యోగాలపై చర్చించారు. డిజిటల్ రంగంలో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులకు DPRలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. మరోవైపు T-Fiber పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

telangana,education

news,telangana
చిప్ డిజైన్‌కు హైదరాబాద్ హబ్.. సెమీకండక్టర్ పెట్టుబడులు తెలంగాణకే రావాలి: శ్రీధర్‌బాబు
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్-2.0లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిప్ డిజైన్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) రంగంలో హైదరాబాద్ ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని, ఇప్పుడు సెమీకండక్టర్ తయారీ పెట్టుబడుల్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.