స్వేచ్ఛ కోసం సాగిన ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ పన్నులు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ పోరాటానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక కేంద్రంగా నిలిచింది. కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం నుంచి వరంగల్ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన బత్తిని మొగిలయ్య వరకు.. పాలకుర్తి, పరకాల, బైరాన్‌పల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ గడ్డపై సాగిన ఆ పోరాట పథాన్ని గుర్తుచేసుకుందాం.
సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ బలగాల పరేడ్ రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను వీక్షించిన ఆయన.. భద్రత, ట్రాఫిక్, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.