అమరావతి, సెప్టెంబర్ 9 (జనవాణి): వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని నారా లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగానే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సమూహాలు నిర్వహించే వినాయక చవితి వేడుకలు విజయవంతంగా జరగాలని మంత్రి ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలందరిపై తన ఆశీస్సులు కురిపించాలని కోరుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినాయక మండపాల నిర్వాహకులకు విద్యుత్ బిల్లుల భారం కొంతమేర తగ్గనుంది. పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Loading Tweet...




















