విధులను నిర్లక్ష్యం చేస్తూ సుదీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో గైర్హాజరవుతున్న మరో 193 మందిపై చర్యలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం అంటే ప్రజల మధ్య ఉండే వ్యవస్థ అని, పేదలకు సేవ చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.76 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉల్లి, కంది పప్పు, పామాయిల్ వంటి సరుకులను త్వరలో ఈ వ్యవస్థల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్-1లో 163 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో మొత్తం 729 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర వివరాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
వినాయక చవితి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది.
విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్ననాటి రోజుల్లో ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్లు కూడా తమ బోధనా విధానాలను మార్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ అవకాశం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ బస్సుల సంఖ్యను పెంచి, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదని వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3 రెండో దశను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో నిర్మించిన ఈ 21.77 కిలోమీటర్ల కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను సీఎం కొనియాడుతూ వారికి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో భాగంగా అత్యాధునిక అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 500 వాహనాల్లో తొలి విడతగా 300 వాహనాలను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెలలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం 'మీభూమి–బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.