#Vinayaka Chavithi

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vinayaka Chavithi.

7 Stories

Stories tagged with #Vinayaka Chavithi

15 వేల కిలోమీటర్ల దూరంలో వినాయక చవితి.. మంచుతో గణపతి తయారు చేసిన భారత శాస్త్రవేత్తలు
international,news,spiritual

15 వేల కిలోమీటర్ల దూరంలో వినాయక చవితి.. మంచుతో గణపతి తయారు చేసిన భారత శాస్త్రవేత్తలు

స్వదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటార్కిటికాలో భారత శాస్త్రవేత్తలు వినాయక చవితిని వినూత్నంగా జరుపుకున్నారు. మైత్రి పరిశోధన కేంద్రంలో మంచుతో గణపతి విగ్రహాన్ని స్వయంగా రూపొందించి పూజలు నిర్వహించారు. అనంతరం పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కేంద్రం లోపలే నీటితో నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

24 సెప్టెం, 20261 min read
రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య
news,spiritual,telangana

రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య

వరంగల్ శివనగర్ వాసవికాలనీలోని వినాయక ట్రస్టు భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి గణపతిని ఏకంగా రూ.1.93 కోట్ల విలువైన వివిధ రంగుల కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది రూ.1.51 కోట్ల కరెన్సీతో అలంకరించగా.. ఈసారి మరో రూ.42 లక్షల విలువైన నోట్లను అదనంగా వినియోగించారు.

21 సెప్టెం, 20261 min read
24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం
news,spiritual,telangana

హైదరాబాద్ లో బంగారం,అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య

హైదరాబాద్‌ బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారంతో పాటు 3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత ప్రతిమను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

15 సెప్టెం, 20261 min read
చంద్రబాబు నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
andhra-pradesh,news

చంద్రబాబు నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి.. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు.

14 సెప్టెం, 20261 min read
కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ రెడ్డి వినాయక పూజలు
news,telangana,spiritual

కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ రెడ్డి వినాయక పూజలు

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

14 సెప్టెం, 20261 min read
గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
andhra-pradesh,news,spiritual

గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినాయక చవితి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

9 సెప్టెం, 20261 min read
వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
news,spiritual,telangana

వినాయక చవితికి హైదరాబాద్‌లో పటిష్ట బందోబస్తు.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపాలకు జియో ట్యాగింగ్‌, ప్రధాన నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక, సోషల్‌ మీడియాలో వదంతులపై 24 గంటల నిఘా వంటి చర్యలకు సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

5 సెప్టెం, 20262 min read