గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు.. ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు, పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు రాజమహేంద్రవరం జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది.

7 ఆగస్టు, 2026 7:40 PM•ByRalin

Share this article

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు.. ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు, పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్

రాజమహేంద్రవరం, ఆగస్టు 7 (జనవాణి): 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి శుక్రవారం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపు రూట్లు, పుష్కర ఘాట్లకు అనుసంధాన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, బ్యారికేడింగ్, దిశా నిర్దేశక బోర్డులు, భద్రతా చర్యలు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాల ఏర్పాటుపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

భక్తుల రద్దీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులు సూచించారు.

ఈ పరిశీలనలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పాటిల్ దేవరాజ్ మనీష్, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు