ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్‌-1లో 163 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో మొత్తం 729 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర వివరాలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

15 సెప్టెంబర్, 2026 2:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు ఇవే!

అమరావతి,సెప్టెంబర్ 15 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 729 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది.

ఇందులో అత్యంత కీలకమైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో 163 పోస్టులు ఉన్నాయి. వివిధ ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

గ్రూప్‌-1లో పోస్టుల వివరాలు:

డిప్యూటీ కలెక్టర్లు – 11

ఏపీ టాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు – 14

డీఎస్పీ (సివిల్‌) – 36

డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌) – 3

డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లు (DEO) – 14

ఆర్టీవోలు – 3

జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ – 1

డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌ – 15

మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 – 12

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్లు – 2

డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్లు – 3

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్లు – 14

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు – 35

ఇదిలా ఉండగా, మరో 5 విభాగాల్లోని పోస్టులకు నోటిఫికేషన్లు బుధవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే మరో 10 విభాగాలకు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్లు ఈ నెల 24న విడుదల చేయనున్నారు.

అభ్యర్థులు పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఇతర అర్హతలు వంటి పూర్తి వివరాలను APPSC అధికారిక వెబ్‌సైట్‌ (https://portal-psc.ap.gov.in)లో పరిశీలించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు