పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు..పదో తరగతి పాసైతే చాలు

10వ తరగతి పాసైన వారికి పోస్టల్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

1 సెప్టెంబర్, 2026 11:34 AM•ByNarender Kumar Nangunoori

Share this article

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు..పదో తరగతి పాసైతే చాలు

Social Media Image

Job Notification, సెప్టెంబర్ 01 (జనవాణి): ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పదో తరగతి ఉత్తీర్ణులకు ఇది మంచి అవకాశం. India Post దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 918 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 23,757

జనరల్: 10,640

OBC: 4,433

SC: 3,082

ST: 2,773

EWS: 2,160

తెలంగాణ: 419

ఆంధ్రప్రదేశ్: 918

అర్హతలు ఇవే

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్‌కు అవసరమైన స్థానిక భాషపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అలాగే సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. 2026 సెప్టెంబర్ 21 నాటికి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.29 వేల వరకు జీతం

ఎంపికైన వారికి పోస్టును బట్టి వేతనం లభిస్తుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ (BPM) పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM, డాక్ సేవక్ తదితర పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు నెలవారీ వేతనం ఉంటుంది.

రాత పరీక్ష లేదు.. పదో తరగతి మార్కులే కీలకం

ఈ నియామకంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం రాత పరీక్ష లేకపోవడం. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. రోజువారీ విధులు నిర్వహించేందుకు అవసరమైన ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను పోస్టల్ శాఖ అందిస్తుంది. అయితే సంబంధిత పోస్టాఫీసుకు అందుబాటులో ఉండే విధంగా అభ్యర్థి నివాసం ఉండాల్సిన నిబంధన ఉంటుంది.

దరఖాస్తు వివరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 2, 2026

చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026

దరఖాస్తు ఫీజు: రూ.100

మహిళలు, SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ఎంపికైన అభ్యర్థులు నియామక సమాచారం అందిన తర్వాత 15 రోజుల్లోగా సంబంధిత డివిజన్/యూనిట్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి, అవసరమైన అర్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోస్టల్ శాఖ వెబ్‌సైట్‌ indiapost.gov.in లో నోటిఫికేషన్‌ పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు