పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేదు, 10వ తరగతి పాసైతే చాలు

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏపీలో 918, తెలంగాణలో 419 పోస్టులు ఉన్నాయి.

27 ఆగస్టు, 2026 10:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేదు, 10వ తరగతి పాసైతే చాలు

Social media image

Postal Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో BPM, ABPM, డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి?

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష లేకుండానే ఎంపిక

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

వేతనం ఎంత?

పోస్టును బట్టి వేతనం ఉంటుంది. BPM పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం లభిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలకు సంబంధించిన పనులకు అదనంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు?

పోస్టల్ శాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 జీడీఎస్ ఖాళీలు ఉన్నాయి. ఇతర పోస్టల్ సర్కిళ్లలోని ఖాళీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోని Vacancy వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.

రోజుకు నాలుగు గంటలే పని

ఎంపికైన జీడీఎస్ ఉద్యోగులు రోజుకు సుమారు నాలుగు గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలు, సర్కిల్ వారీగా పోస్టుల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ కోసం India Post GDS (https://www.indiapost.gov.in/gdsonlineengagement) అధికారిక వెబ్‌సైట్ను పరిశీలించాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు