కొత్తగా కారు కొనాలని చూస్తున్న వారికోసం హోండా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. హోండా కంపెనీకి చెందిన ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ఇచ్చింది. జూలై 31వ తేదీలోగా ఈ మూడు కార్లను కొనుగోలు చేసిన వారికి రూ.2.15 లక్షల వరకు రాయితీ పొందవచ్చని తెలిపింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ అన్ని కలుపుకుని ఈ డిస్కౌంట్ వస్తుందని పేర్కొంది.
హోండా ఎలివేట్‌పై అత్యధిక ఆఫర్
ప్రస్తుతం హోండా ఎలివేట్ ఎస్‌యూవీపైనే అత్యధిక డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, ఇన్సూరెన్స్, యాక్సెసరీ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. స్టాక్ కూడా రెడీగా ఉండటంతో ఎంపిక చేసిన వేరియంట్లపై స్పీడ్ డెలివరీ కూడా లభించనుంది.
హోండా సిటీ, అమేజ్‌పై కూడా మంచి బెనిఫిట్స్
హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేసే వారికి రూ.90 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇక ఎంట్రీ లెవల్ సెడాన్ అయిన అమేజ్‌పై రూ.75 వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ రెండు కార్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ స్కీమ్‌లు, లాయల్టీ బోనస్ వర్తించే అవకాశం ఉంది. అయితే ఇవి వేరియంట్, సిటీ, డీలర్‌ను బట్టి మారే అవకాశం ఉంది.
ఈఎంఐ ఆఫర్లు కూడా!
హోండా కంపెనీ డిస్కౌంట్లతో పాటు కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ప్రత్యేక ఈఎంఐ ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లతో కార్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఉద్యోగులకు కార్పొరేట్ బెనిఫిట్స్, ఇప్పటికే హోండా కస్టమర్లుగా ఉన్నవారికి లాయల్టీ బోనస్ కూడా వర్తించనుంది.
ఆఫర్ ఇంకా మూడు రోజులే!
హోండా కంపెనీ ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు జూలై 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత డిస్కౌంట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని వేరియంట్ల స్టాక్ పరిమితంగా ఉండటంతో ముందుగానే డీలర్లను సంప్రదించి ఆఫర్లు, వాహన లభ్యత, ఫైనల్ ఆన్ రోడ్డు ప్రైజ్ తెలుసుకోవడం మంచిదని ఆటో మొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.




















