
తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!
తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.
District-news-telangana విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

తెలంగాణలో ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుడిపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక వేదింపులు న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తున్నాడని ఆరోపించింది.

వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనుంది.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ బస్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు వచ్చి తన పార్టీ ప్రభుత్వంతో బకాయిలను చెల్లింపజేయాలని సవాల్ చేశారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోందని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.

తెలంగాణలో 22A నిషేధిత జాబితా నుంచి భూములను మినహాయించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం వరకు అర్హమైనవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA నిర్వహించిన తనిఖీలు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో చేపట్టిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన హైదరాబాద్ యువకుడు సాయిప్రదీప్ ఉద్యోగం కోసం నాలుగు నెలలుగా ప్రయత్నించినట్లు సమాచారం.

శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సులో తనకు చేదు అనుభవం ఎదురైందంటూ ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. మదన్‌పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకున్నానని, అయితే బస్సు అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద నిలిపారని ఆమె తెలిపింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం చెంపదెబ్బలు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

హైదరాబాద్ ఉప్పల్ రింగ్‌రోడ్డులో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ నిర్వహించారు. ‘యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘సేవ్ టీచర్.. సేవ్ స్కూల్’ నినాదాలతో టీచర్లు ర్యాలీ చేపట్టారు.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. PMAY-G కింద కేంద్రం నుంచి ప్రతి ఇంటికి రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహారాష్ట్రలోని టిపేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి పులుల కదలికలు పెరిగాయి. భీంపూర్ మండలం అర్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో పులి కనిపించగా.. మరో పులి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అడుగుజాడల ద్వారా గుర్తించారు.

మూడు నెలల్లో రెండో ప్రమాదం.. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మూడు నెలల్లోనే హెజీ ఫార్మా పరిధిలో రెండో ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. రియాక్టర్ పేలుడుకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. సీఎం అధికార దుర్వినియోగం చేసి తన సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకాయుక్త ఈ ఫిర్యాదుకు 835/2026 నంబర్ కేటాయించినట్లు తెలుస్తోంది.

హనుమకొండలో కారులో లభ్యమైన యువతి మృతదేహాన్ని గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానసగా పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డు ఆధారంగా గుర్తింపు లభించింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘాటుగా స్పందించగా.. రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రం వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం లాఠీ దెబ్బలు తినడానికైనా, జైలుకు వెళ్లడానికైనా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తలొగ్గకుండా తమ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఓ మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఖరీదైన కోచింగ్ సెంటర్లు, స్టడీ మెటీరియల్ కోసం అదనపు ఖర్చులు లేకుండానే ప్రామాణిక సమాచారాన్ని చదువుకునేందుకు ‘నాలెడ్జ్ కార్నర్’ ఏర్పాటు చేశారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పలు కీలక పుస్తకాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ గదిలో ఉచితంగా చదువుకునే సదుపాయం కల్పించారు.

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పెట్టిన ‘అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే’ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ తీవ్ర చర్చకు దారితీసింది.

ల్గొండలో ప్రిన్సిపల్ దారుణ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్ 27 కత్తిపోట్లు.. ప్రిన్సిపల్ హత్య వెనుక టెన్త్ విద్యార్థులేనా? స్కూల్‌కు వస్తూనే ఉన్నారు.. కానీ హత్య కేసులో అనుమానితులుగా విద్యార్థులు రూ.4 లక్షల కోసమే హత్య చేశారా?.. ప్రిన్సిపల్ కేసులో పోలీసుల దర్యాప్తు 80 మందిని విచారించిన తర్వాత కీలక మలుపు.. ముగ్గురు విద్యార్థులపై అనుమానం

రామగుండం లక్ష్మీపురంలో స్థలం కబ్జాపై ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతుల 20 ఏళ్ల ఇంటిని నోటీసు లేకుండా కూల్చివేశారని ఆరోపణలు. న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన.

ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

'100% ప్యూర్ గీ’ పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌లో 130 చోట్ల తనిఖీలు పామాయిల్, వనస్పతి కలిపి నెయ్యి తయారీ.. 36 టన్నుల కల్తీ సరుకు సీజ్ నెయ్యి పేరుతో కల్తీ దందా.. 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాల్లో తనిఖీలు హోటళ్లు, స్వీట్ షాపులకు కల్తీ నెయ్యి సరఫరా.. హైదరాబాద్‌లో H-FAST భారీ దాడులు పూజల నెయ్యినీ వదల్లేదు.. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీపై ఉక్కుపాదం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

కాకతీయ వైద్య కళాశాల, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.