వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం

వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కమిషనర్ తదితరులు మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారికి ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

18 ఆగస్టు, 2026 3:58 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం

వరంగల్, ఆగస్టు 18 (జనవాణి): వరంగల్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవస్థానం పరిధిలోని భద్రకాళి చెరువు సుందరీకరణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కమిషనర్ వెంకన్న, కుడా(KUDA) అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రకాళి చెరువు సుందరీకరణతో వరంగల్ నగరానికి మరింత అందం చేకూరిందన్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా భద్రకాళి బండ్‌పై వివిధ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

భక్తులు, నగరవాసులు, పర్యాటకులు ప్రశాంత వాతావరణంలో బండ్‌పై విహరిస్తూ చెరువు అందాలను ఆస్వాదించేలా మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఎక్కువ దూరం నడవలేని వారికి ఎలక్ట్రిక్ వెహికిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. భద్రకాళి దేవస్థానం, చెరువు పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ఆకర్షణకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, కుడా, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

భద్రకాళి బండ్‌ను వరంగల్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. బండ్‌పై పచ్చదనం, నడక మార్గాలు, సందర్శకులకు అనుకూలమైన వసతులు, అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో సందర్శకుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు