#Warangal

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Warangal.

30 Stories

Stories tagged with #Warangal

మూడేళ్ల ప్రేమ..మూడు అబార్షన్లు.. మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు
crime,news,telangana

మూడేళ్ల ప్రేమ..మూడు అబార్షన్లు.. మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరై, గర్భం దాల్చిన సందర్భాల్లో అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. యువతికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు.

6 అక్టో, 20262 min read
హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ
crime,news,telangana

హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ

హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

2 అక్టో, 20261 min read
Warangal to Karimnagar NH563 Road
news,telangana

వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ఇక 45 నిమిషాలే.. కొత్త హైవే సిద్ధం!

వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. రూ.1,641 కోట్లతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు లేన్ల జాతీయ రహదారి-563 పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ ప్రారంభమైన ఈ హైవేను అక్టోబర్‌ తొలి లేదా రెండో వారంలో అధికారికంగా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రహదారితో వరంగల్‌-కరీంనగర్‌ ప్రయాణ సమయం దాదాపు గంటన్నర నుంచి 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది.

1 అక్టో, 20263 min read
వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు
news,telangana,politics

వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. విమానాశ్రయానికి రేచర్ల రుద్రారెడ్డి పేరు పెట్టాలన్న ప్రతిపాదన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. అయితే, విమానాశ్రయానికి తుది పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

30 సెప్టెం, 20261 min read
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్...  ఇద్దరు రెడ్డి నేతలకే టికెట్లా? అంటూ కవిత ఫైర్
news,politics,telangana

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్... ఇద్దరు రెడ్డి నేతలకే టికెట్లా? అంటూ కవిత ఫైర్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు స్థానాలకూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంపిక చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.

30 సెప్టెం, 20262 min read
Social Media Image
news,telangana

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే

తెలంగాణలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుగా నమోదుకు అర్హులైన వారు Form-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా తాజా జాబితాలో చేరేందుకు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

29 సెప్టెం, 20262 min read
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆడోళ్లతో కొట్టిస్తా...కొండా సురేఖ బిగ్ వార్నింగ్
news,politics,telangana

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆడోళ్లతో కొట్టిస్తా...కొండా సురేఖ బిగ్ వార్నింగ్

వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో గట్టిగా సమాధానం చెప్పిస్తామని వ్యాఖ్యానించారు.

29 సెప్టెం, 20262 min read
నా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోను.. కొండా సురేఖ హెచ్చరిక
news,politics,telangana

నా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోను.. కొండా సురేఖ హెచ్చరిక

మంత్రి పదవి కోల్పోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవ చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టి అభివృద్ధి చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. తమ అనుచరుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

29 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!
news,telangana,politics

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

25 సెప్టెం, 20261 min read
రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య
news,spiritual,telangana

రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో కొలువుదీరిన కరెన్సీ గణపయ్య

వరంగల్ శివనగర్ వాసవికాలనీలోని వినాయక ట్రస్టు భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి గణపతిని ఏకంగా రూ.1.93 కోట్ల విలువైన వివిధ రంగుల కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది రూ.1.51 కోట్ల కరెన్సీతో అలంకరించగా.. ఈసారి మరో రూ.42 లక్షల విలువైన నోట్లను అదనంగా వినియోగించారు.

21 సెప్టెం, 20261 min read
తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదల
news,politics,telangana

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. నవంబర్‌ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించిన అధికారులు.. గతంలో ఓటర్లుగా నమోదైన వారు సైతం ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

17 సెప్టెం, 20261 min read
Parakala Amaradhamam
news,telangana,special-stories

నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి.. వరంగల్‌ గడ్డపై రక్తంతో రాసిన పోరాట చరిత్ర ఇదే!

స్వేచ్ఛ కోసం సాగిన ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ పన్నులు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ పోరాటానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కీలక కేంద్రంగా నిలిచింది. కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వం నుంచి వరంగల్‌ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన బత్తిని మొగిలయ్య వరకు.. పాలకుర్తి, పరకాల, బైరాన్‌పల్లి వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ గడ్డపై సాగిన ఆ పోరాట పథాన్ని గుర్తుచేసుకుందాం.

17 సెప్టెం, 20264 min read
భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!
crime,news,telangana

భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16 సెప్టెం, 20261 min read
గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?
education,news,spiritual,telangana

గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?

హనుమకొండలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. మాల విరమణ చేసిన తర్వాతే స్కూల్‌కు రావాలని చెప్పడంతో విద్యార్థుల తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు పాఠశాలకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

16 సెప్టెం, 20261 min read
పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది: కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది: కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పలువురు ఫోన్లు చేసినా ఆమె వెళ్లలేదని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయాలన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని పేర్కొన్నారు.

13 సెప్టెం, 20262 min read
Konda Sureka
news,politics,telangana

కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు.. అసలు కారణమేంటి?

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీ పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వెంటనే ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు సందేశం పంపినట్లు సమాచారం. మరోవైపు ఆమెకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే అంశంపై అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

12 సెప్టెం, 20262 min read
ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ
education,news,telangana

ఓరుగల్లు గడ్డపై విద్యార్థుల పోరుబాట.. హనుమకొండలో భారీ ర్యాలీ

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

5 సెప్టెం, 20262 min read
కొండా సురేఖకు బస్వరాజు సారయ్య ఓపెన్ ఛాలెంజ్.. ధైర్యముంటే రండి..‘ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం’
news,politics,telangana

కొండా సురేఖకు బస్వరాజు సారయ్య ఓపెన్ ఛాలెంజ్.. ధైర్యముంటే రండి..‘ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం’

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సారయ్య.. ధైర్యముంటే ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని సురేఖకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఎన్నికల్లో తలపడదామని సవాల్ విసిరారు.

4 సెప్టెం, 20262 min read
అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు: ఎంపీ కడియం కావ్య
news,telangana

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విమర్శలు: ఎంపీ కడియం కావ్య

బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, 1000 రోజుల పాలనే తమ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అని పేర్కొన్నారు.

2 సెప్టెం, 20262 min read
Warangal | రేవంత్ సర్కార్ 1,000 రోజుల సందర్బంగా కాంగ్రెస్‌ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత
news,politics,telangana

Warangal | రేవంత్ సర్కార్ 1,000 రోజుల సందర్బంగా కాంగ్రెస్‌ ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలకు 1,000 కిలోల ఉల్లిపాయలను పంపిణీ చేశారు. వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

1 సెప్టెం, 20261 min read
కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

31 ఆగ, 20262 min read
హత్య కేసులో జీవిత ఖైదు.. 40 ఏళ్లుగా పరారీ.. ప్రభుత్వ టీచర్‌గా సేవలు, పెన్షన్ కూడా!
crime,district,news,telangana

హత్య కేసులో జీవిత ఖైదు.. 40 ఏళ్లుగా పరారీ.. ప్రభుత్వ టీచర్‌గా సేవలు, పెన్షన్ కూడా!

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పెరోల్‌పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగాడు. ఈ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 ఏళ్లు పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడమే కాకుండా, పదవీ విరమణ అనంతరం పెన్షన్ కూడా తీసుకున్నాడు. చివరకు వరంగల్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు.

27 ఆగ, 20262 min read
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ పర్యటనకు బ్రేక్
education,news,telangana

హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ పర్యటనకు బ్రేక్

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా వరంగల్ పర్యటనకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

27 ఆగ, 20261 min read
Social Media Image
crime,district,news,telangana

Warangal: మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్‌ న్యూసెన్స్..లాఠీ ఝుళిపించిన పోలీసులు

వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం చెంపదెబ్బలు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

22 ఆగ, 20261 min read
janavaani Image
district,news,telangana

రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగింపు.. హనుమకొండలో కాంట్రాక్ట్ కండక్టర్ల నిరసన

హనుమకొండలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కండక్టర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న సుమారు 90 మంది కండక్టర్లను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22 ఆగ, 20261 min read
AI Image
telangana,news,politics

‘బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’.. కొండా ఫ్యామిలీపై ఎమ్మెల్యే నాయిని ఘాటు విమర్శలు

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు ముదురుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొండా సురేఖపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

22 ఆగ, 20262 min read
సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు
district,news,politics,telangana

సాగునీరు విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు

దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన కాలువ బాట ఉద్రిక్తంగా మారింది. సింగరాజుపల్లి గ్రామంలో ధర్నాకు దిగిన ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

20 ఆగ, 20261 min read
వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం
district,news,telangana,tourism

వరంగల్ భద్రకాళి బండ్‌కు కొత్త అందం..భక్తులు, పర్యాటకులకు ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం

వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కమిషనర్ తదితరులు మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దూరం నడవలేని వారికి ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

18 ఆగ, 20261 min read
Janavaani Image
district,news,telangana

సర్వాయి పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం పాపన్న గౌడ్‌ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

18 ఆగ, 20261 min read
విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
district,environment,news,telangana

విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాకతీయ వైద్య కళాశాల, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

18 ఆగ, 20262 min read