ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

11 ఆగస్టు, 2026 9:07 PM•ByRalin

Share this article

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 10 (జనవాణి): హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజులు పొడిగించారు. ఆగస్టు 15వ తేదీ శనివారం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సోమవారం (ఆగస్టు 10) చివరి తేదీగా నిర్ణయించారు. అయితే రెండో శనివారం, బోనాల పండుగ తదితర వరుస సెలవుల నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువు పొడిగించాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీంతో మరో ఐదు రోజులు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు

జూలై 21 నుంచి మీ-సేవా కేంద్రాలతోపాటు ఆన్‌లైన్‌, మీ-సేవా వాట్సాప్‌ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10 సాయంత్రం వరకు మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రజల నుంచి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ పథకానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన మరింత మంది అర్హులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.

లక్ష ఇళ్ల నిర్మాణం

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం కింద లక్ష ఇళ్లను నిర్మించనున్నట్లు పొంగులేటి తెలిపారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అందుబాటులోకి తీసుకువచ్చి, నామమాత్రపు ధరలోనే పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఈ నెలాఖరుకు కేటాయింపులు

దరఖాస్తుల గడువు పొడిగించినప్పటికీ.. దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇళ్ల కేటాయింపుపై దరఖాస్తుదారులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు