బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ముఖ్యంగా తీన్మార్ వార్తల్లో తనదైన తెలంగాణ యాసతో, సహజమైన మాటలతో సావిత్రిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక అదే క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి వెళ్లి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక శివజ్యోతి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో శివజ్యోతి దంపతులు ఒక గుడ్ న్యూస్ చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తమ జీవితంలోకి వచ్చిన ఆ చిన్నారి తమకు ఎంతో ప్రత్యేమని, ఈ ఏడాది తనకు మరింత స్పెషల్‌గా మారిందని ఆమె ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు. తమ గారాల పట్టికి 'వెన్నెల' అని అందమైన నామకరణం కూడా చేశారు. అలా తల్లిగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తూనే మరోవైపు తన కూతురితో కలిసి ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతున్నారు.
ఇటీవలే శివజ్యోతి తన కూతురు వెన్నెలకు ఘనంగా అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అపురూపమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అంతకుముందు కూడా అన్నప్రాసన వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకోగా అవి తెగ వైరల్ అయ్యాయి. కాగా.. తాజాగా కూతురితో కలిసి దిగిన మరిన్ని క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలను పోస్ట్ చేసింది. పాప వెన్నెల సాంప్రదాయ పట్టు వస్త్రాలు, ట్రెడిషనల్ వేర్‌లో ఎంతో ముద్దుగా, బొమ్మలా కనిపిస్తుంది. చిన్నారిని చూసి మురిసిపోతున్న శివజ్యోతి హావభావాలు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వేడుకను కుటుంబ సభ్యులు, కొద్దిమంది అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిపించారు శివజ్యోతి అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ ఫొటోలకు లైకులు కొడుతూ చిన్నారికి తమ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. తల్లిగా శివ జ్యోతి పడుతున్న ఆనందం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.




















