Shivajyothi | కూతురి అన్నప్రాశనలో మురిసిపోయిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్

ప్రముఖ యాంకర్ శివజ్యోతి తన కూతురి అన్నప్రశాన ఫొటోలను తాజాగా సోషల్‌మీడియాలో పంచుకుంది. వాటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

30 జులై, 2026 9:03 PM•ByRalin

Share this article

Shivajyothi | కూతురి అన్నప్రాశనలో మురిసిపోయిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్

కూతురి అన్నప్రశాన వేడుకలో యాంకర్ శివజ్యోతి

Shivajyothi | ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తల్లిగా మారిన తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి.. ఇప్పుడు మాతృత్వంలోని ప్రతి మధుర క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. గర్భం దాల్చిన రోజు నుంచి చిన్నారి జన్మించే వరకు తన ఆనందాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆమె.. ఇప్పుడు కూతురి ఎదుగుదలలోని ప్రతి మైలురాయిని కూడా అదే విధంగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తన చిన్నారికి నిర్వహించిన అన్నప్రాశన వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా మంచి స్పందన లభించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ వేడుకలోని మరిన్ని అందమైన క్షణాలను ' నా వెన్నెలమ్మ...' అనే క్యాప్షన్‌తో తాజాగా మరోసారి అభిమానులతో పంచుకోవడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లేత గులాబీ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన శివజ్యోతి.. ఒడిలో కూర్చున్న చిన్నారికి వెండి గిన్నెలో తొలి అన్నం తినిపిస్తూ మరిసిపోయారు. అనంతరం పాపతో ఆడుకుంటూ మైమరిచిపోయారు. ఈ సందర్భంగా చిన్నారి అమాయకపు హావభావాలు, తల్లీకూతుళ్ల చిరునవ్వులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వారి వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ బిడ్డకు తల్లి అనిపిస్తున్నట్లుగా ఉన్న దృశ్యం ఈ ఫొటోలకు మరింత ఆధ్యాత్మికత, అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఫొటోలు ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు కార్యక్రమంతో శివజ్యోతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని మరింత ప్రజాదరణ సంపాదించింది. అయితే పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత ఆమెకు సంతానం కలగడంతో ఆనందాన్ని ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. గర్భధారణ నుంచి చిన్నారి పుట్టిన రోజు రోజు వరకు ప్రతి దశను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఇప్పుడు కూతురి అన్నప్రాశన వేడుకను కూడా అందరితో పంచుకోవడతో ఆ పోస్టులు వైరల్‌గా మారాయి.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు