ఢిల్లీ, సెప్టెంబర్ 01 (జనవాణి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. పలువురు మంత్రులు, ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నేతలపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని బాంబు పేల్చారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు.

national,news,telangana,andhra-pradesh
సైబర్ నేరాలపై భారీ ఆపరేషన్.. 100 మందికి పైగా ఏజెంట్లు అరెస్ట్
6 అక్టో, 20261 min read



















