స్మార్ట్‌ఫోన్ KYCలో వింత కష్టాలు..వీడియో చూసి నవ్వుతున్న నెటిజన్లు

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కేవైసీ పూర్తి చేసుకునే సమయంలో ఈశాన్య భారతంలోని ఓ వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో తీసే సమయంలో అతడి కళ్లు తెరిపించేందుకు చుట్టుపక్కల వారు పడిన పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి.

14 ఆగస్టు, 2026 6:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

స్మార్ట్‌ఫోన్ KYCలో వింత కష్టాలు..వీడియో చూసి నవ్వుతున్న నెటిజన్లు

ఒకప్పుడు కేవైసీ (KYC) పూర్తి చేసుకోవాలంటే సంబంధిత కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌, యాప్‌ల సాయంతో ఇంటి నుంచే కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. అయితే, ఈ విధానంలోనూ కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఈశాన్య భారతానికి చెందిన ఓ వైరల్ వీడియో చర్చకు తెరలేపింది.

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. ఫొటో తీసే సమయంలో అతడికి ఎదురైన ఇబ్బందులు నవ్వులు పూయిస్తున్నాయి. అతడి కళ్లు పూర్తిగా తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కల వారు నానా తంటాలు పడ్డారు. కొందరు అతడి కనురెప్పలను తెరిచి పట్టుకోగా.. మరికొందరు ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. చివరకు తమ ప్రయత్నాలను చూసుకుని వారే నవ్వుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా ఆలోంగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. సరదా పోస్టులు, కామెంట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి షేర్ చేసిన ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి. వీడియో సరదాగా ఉన్నప్పటికీ.. ఈ ఘటన ఈశాన్య ప్రాంతాల్లో డిజిటల్ KYC సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ KYC విధానాలు అందుబాటులో ఉండాలని పలువురు సూచిస్తున్నారు. నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ ‌లో ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు