చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు.. రాఖీలు కట్టిన విద్యార్థినులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల చేత రాఖీలు కట్టించుకున్న ఆయన.. విద్యార్థినుల పేర్లు, తరగతులు అడిగి తెలుసుకుని వారితో సరదాగా ముచ్చటించారు.

28 ఆగస్టు, 2026 3:17 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు.. రాఖీలు కట్టిన విద్యార్థినులు

ఢిల్లీ, ఆగస్టు 28 (జనవాణి): రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉన్న తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు ప్రధానమంత్రి మోదీకి రాఖీలు కట్టారు. రాఖీలు కట్టే సమయంలో చిన్నారుల పేర్లు, వారు చదువుతున్న తరగతి గురించి ప్రధాని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులతో ఆత్మీయంగా గడిపిన ఈ క్షణాలకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ రక్షాబంధన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోదీ
విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోదీ

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు