కాళీమాత ఆలయంలో చేపల ప్రసాదం.. వైరల్‌గా మారిన సువేందు అధికారి వీడియో

కౌశికి అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని కాళీఘాట్ కాళీమాత ఆలయాన్ని బెంగాల్ సీఎం సువేందు అధికారి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సంప్రదాయ భోగ్‌ను స్వీకరించారు. చేపలు, బసంతి పులావ్‌తో కూడిన ఈ నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

11 సెప్టెంబర్, 2026 3:51 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కాళీమాత ఆలయంలో చేపల ప్రసాదం.. వైరల్‌గా మారిన సువేందు అధికారి వీడియో

X Image

కోల్‌కతా, సెప్టెంబర్ 11 (జనవాణి): కౌశికి అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ కాళీమాత ఆలయాన్ని బెంగాల్ సీఎం సువేందు అధికారి సందర్శించారు. గురువారం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయంలో సంప్రదాయంగా సమర్పించే భోగ్‌ను ప్రసాదంగా స్వీకరించారు. ఇందులో చేపలు, బసంతి పులావ్ ఉన్నాయి. సువేందు అధికారి ఈ నైవేద్యాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాళీఘాట్ కాళీమాత ఆలయంలో సంప్రదాయం ప్రకారం అమ్మవారికి చేపలు, మేక మాంసం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. పూజల అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.

ఇదిలా ఉంటే.. బెంగాల్‌లో ప్రస్తుతం దుర్గాపూజ సందర్భంగా మాంసాహారం తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల భగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచించారు. దుర్గాపూజ వేళ నాన్‌వెజ్ తినేవారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో కౌశికి అమావాస్య సందర్భంగా కాళీమాత ఆలయాన్ని సందర్శించిన సువేందు అధికారి అక్కడి సంప్రదాయ నాన్‌వెజ్ భోగ్‌ను స్వీకరించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు