వాట్సాప్ యూజర్లకు షాక్..ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ కాక ఇబ్బందులు

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. మరికొందరి ఖాతాలు ఐతే అండర్ రివ్యూ లోకి వెళ్లడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

4 ఆగస్టు, 2026 1:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వాట్సాప్ యూజర్లకు షాక్..ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ కాక ఇబ్బందులు

Image by CNBCTV18.com

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన WhatsApp లో సాంకేతిక సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫోటోలు, వీడియోలు పంపించలేకపోతున్నారు.

చాట్‌లో మీడియా ఫైళ్లను పంపే సమయంలో అవి పూర్తిగా అప్‌లోడ్ కాకుండా 'స్పిన్నింగ్ ఐకాన్' వద్దే నిలిచిపోతున్నాయి. అనంతరం Retry అనే సందేశం కనిపిస్తుండటంతో యూజర్లు మీడియా షేర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతసేపు సమస్య తగ్గినట్లు కనిపించినా, మంగళవారం తెల్లవారుజామున మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.

భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో, జర్మనీ తదితర దేశాల్లో కూడా ఇదే సమస్య నమోదవుతోందని సమాచారం. సోషల్ మీడియా వేదికగా వేలాది మంది యూజర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు సాధారణ వినియోగదారుల వాట్సాప్ ఖాతాలను 24 గంటల పాటు Under Review లో ఉంచినట్లు సమాచారం. నిబంధనలను ఉల్లంఘించారనే సందేశంతో కొన్ని ఫీచర్లను తాత్కాలికంగా నిలిపివేయడం కూడా యూజర్లలో ఆందోళన కలిగించింది.

ఈ అంశంపై వాట్సాప్ మాతృసంస్థ మెటా స్పందించింది. ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని అరికట్టే ప్రక్రియలో అప్పుడప్పుడు ఇలాంటి సాంకేతిక పొరపాట్లు చోటు చేసుకోవచ్చని పేర్కొంది. సమస్యను గుర్తించి, వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మెటా వెల్లడించింది.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు