కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ ప్రకారం ఢిల్లీ, ముంబై మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,420 మేర పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగగా.. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఏఐ నిపుణుడు ట్రాపిట్ బన్సల్‌కు మెటా భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై విధించిన పరిమితులపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అకౌంట్‌ను ఎందుకు నియంత్రించారో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత్ ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎస్‌ఏఎమ్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొన్ని గంటల పాటు తొలగించిన ఘటనపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. మరికొందరి ఖాతాలు ఐతే అండర్ రివ్యూ లోకి వెళ్లడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫింగ్, ఏఐ ఆధారిత వీడియోలు వైరల్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో మెటా ఇండియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం షాకిచ్చింది. సమన్లు జారీ చేసింది. డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పటి వరకు ప్రభుత్వ సేవలకే పరిమితమైన మీ సేవ కేంద్రాలు ఇకపై చిన్న వ్యాపారాల డిజిటల్ ప్రచారానికీ వేదిక కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మెటా భాగస్వామ్యంతో మీ సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చుతూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న వ్యాపారులు కూడా తక్కువ ఖర్చుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలు ఇచ్చే అవకాశం పొందనున్నారు.