కూల్ డ్రింక్ పేరుతో నడిచే రైలు... దేశంలో ఇదే తొలిసారి!

లక్నో–ఢిల్లీ మధ్య నడిచే ప్రీమియం తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఇకపై కొత్త పేరు రానుంది. ఆగస్టు 19, 2026 నుంచి ఈ రైలు 'స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’గా నడవనుంది. ఈ రైలు పేరును ఓ కూల్ డ్రింక్ బ్రాండ్‌తో అనుసంధానం చేయడం దేశంలో ఇదే తొలిసారిగా నిలిచింది.

13 ఆగస్టు, 2026 6:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కూల్ డ్రింక్ పేరుతో నడిచే రైలు... దేశంలో ఇదే తొలిసారి!

AI Image

లక్నో–ఢిల్లీ మధ్య ప్రయాణించే తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు ఇండియన్ రైల్వేస్ కొత్త వాణిజ్య రూపాన్ని తీసుకొస్తోంది. ఆగస్టు 19, 2026 నుంచి ఈ రైలు ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’ (Sprite Tejas Express)పేరుతో రాకపోకలు సాగించనుంది. ప్రయాణికుల రైలుకు కూల్ డ్రింక్ సంస్థ బ్రాండ్ పేరును జోడించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. రైలు నంబర్లు 82501/82502గా ఉన్న ఈ సర్వీస్ లక్నో–న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వాణిజ్య ప్రకటనల హక్కులను స్ప్రైట్‌కు కేటాయించింది. దీంతో రైలు వెలుపలి భాగాన్ని స్ప్రైట్ థీమ్‌తో కూడిన ప్రకటనలతో అలంకరించనున్నారు. మార్గంలోని స్టేషన్లలో, రైలులో కూడా ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో అధికారిక అనౌన్స్‌మెంట్లు కూడా చేయనున్నారు.

టికెట్ ధరలు పెంచకుండా అదనపు ఆదాయం

సాధారణంగా భారతీయ రైల్వే స్టేషన్లలో షాపులు, రైలు బోగీలపై ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటుంది. అయితే ఈసారి కొత్తగా ఒక రైలు పేరునే బ్రాండ్ పేరుతో మార్చడం ఇదే తొలిసారి. టికెట్ ధరలను పెంచకుండా, ప్రయాణికులపై ఎలాంటి భారం వేయకుండా రైల్వే శాఖకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఒక ట్రైన్ పేరును రైలుకు పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి. రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకున్నందుకు ఇండియన్ రైల్వేస్‌కు ఐఆర్‌సీటీసీ (IRCTC) హాలింగ్ ఛార్జీలు చెల్లిస్తుంది.

తేజస్ ఎక్స్‌ప్రెస్ వేళలు

లక్నో నుంచి ఈ రైలు ఉదయం 6:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:25 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3:35 గంటలకు బయలుదేరి రాత్రి 10:05 గంటలకు లక్నో చేరుకుంటుంది. మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. డైనమిక్ ప్రైసింగ్ విధానం కారణంగా టికెట్ ధరలు డిమాండ్‌ను బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం ఏసీ చైర్ కార్ బేస్ ఫేర్ సుమారు ₹1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర సుమారు ₹2,450 నుంచి ప్రారంభమవుతుంది. క్యాటరింగ్, బుకింగ్ సమయం తదితర అంశాల ఆధారంగా తుది ధరల్లో మార్పులు ఉండొచ్చు.

రైల్వేలో పెరుగుతున్న నాన్-ఫేర్ రెవెన్యూ

రైల్వే శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే పలు వాణిజ్య మార్గాలను అనుసరిస్తోంది. రైళ్ల కోచ్‌లపై ప్రకటనల కోసం ‘ట్రైన్ ర్యాప్స్’, స్టేషన్లలో బ్రాండింగ్, డిజిటల్ స్క్రీన్లపై ప్రకటనలు వంటి విధానాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లోనూ వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పిస్తోంది.

దేశంలోని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సూపర్ ఫాస్ట్ రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ప్రయాణికుల కోసం ఇందులో రుచికరమైన ఆహారం, పానీయాలతో పాటు ప్రయాణం బోర్ కొట్టకుండా ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పెళ్లిళ్లు, కార్పొరేట్ మీటింగ్స్, ఇతర వేడుకల కోసం ఒక గ్రూప్‌గా ప్రయాణించేందుకు ఇందులో వీలుంది. ప్రయాణికులు కావాలనుకుంటే ఒకేసారి పూర్తి ఏసీ కోచ్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’ ప్రయోగం రైల్వే నాన్-ఫేర్ రెవెన్యూ వ్యూహంలో మరో కీలక అడుగుగా నిలవనుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు