పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపం.. ఖర్చెంతో తెలుసా?

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్ తర్వాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గణనాథుడు బాలాపూర్ గణేశుడు. ప్రతి ఏటా వినూత్నంగా ఏర్పాటు చేసే మండపంతో పాటు భారీ డిమాండ్ ఉండే లడ్డూ వేలం ఈ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపాన్ని తీర్చిదిద్దారు.

15 సెప్టెంబర్, 2026 5:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపం.. ఖర్చెంతో తెలుసా?

Balapur Ganesh Mandapam 2026

హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేశ్. ఆ తర్వాత అంతటి ఆదరణ పొందిన గణనాథుల్లో బాలాపూర్ గణేశుడు ఒకరు. ఈ గణేశుడి ప్రత్యేకత కేవలం విగ్రహానికే పరిమితం కాదు. ప్రతి ఏడాది ఏర్పాటు చేసే మండపం, ఎంతో ప్రసిద్ధి చెందిన లడ్డూ వేలం కూడా బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనా

గతంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అయోధ్య రామ మందిరం, అరుణాచలం, తిరుమల వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపాలను రూపొందించారు. ఈసారి మాత్రం పూరీ జగన్నాథ ఆలయం స్ఫూర్తితో మండపాన్ని తీర్చిదిద్దారు. పూరీ జగన్నాథ ఆలయ నమూనా సెటప్ కోసం సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. డెకరేటర్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ నమూనాను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. శామీర్‌పేటలోని ఓ వర్క్‌షాప్‌లో సుమారు 70 మంది కళాకారులు రాత్రింబవళ్లు శ్రమించి పూరీ ఆలయ నమూనాను సిద్ధం చేసినట్లు తెలిపారు.

Balapur
పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశ్ మండపం

బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక క్రేజ్

బాలాపూర్ గణేశుడిని ‘ఆది వినాయకుడు’ అని కూడా పిలుస్తారు. ఈ గణనాథుడి లడ్డూకు కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది జరిగే లడ్డూ వేలం కోసం భక్తులు, వ్యాపారవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైంది. అప్పటి నుంచి లడ్డూ ధర వేలంలో క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతేడాది ఈ లడ్డూ ఏకంగా రూ.35 లక్షలు పలికింది.

ఈ లడ్డూను దక్కించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు పోటీ పడుతుంటారు. దీంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవాల్లో మండపం తర్వాత అత్యంత ఆసక్తిని రేకెత్తించే అంశంగా లడ్డూ వేలం నిలుస్తోంది.

▶CategoriesNews, Spiritual and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు