బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం

హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

3 సెప్టెంబర్, 2026 12:04 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం

హైదరాబాద్, సెప్టెంబర్ 03 (జనవాణి): బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో భారీగా డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా అందులో 160 డిటోనేటర్లు బయటపడ్డాయి.

పోలీసుల ప్రాథమిక పరిశీలనలో డిటోనేటర్లను మొత్తం 8 బండిల్స్‌గా ఉంచినట్లు గుర్తించారు. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్లు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిటోనేటర్లు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? వాటిని అక్కడే ఎందుకు ఉంచారు? ఏదైనా పేలుడు పదార్థాలతో సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి డిటోనేటర్ల స్వభావం, వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరిస్తోంది.

ఇటీవల ఆయుధాలు మిస్సింగ్‌ అయిన కేసులో భాగంగా బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ డిటోనేటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫైరింగ్‌ క్యాంప్‌కు సమీపంలోనే పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు లభించడంతో పోలీసులు భద్రతాపరంగా ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే ఆయుధాల మిస్సింగ్‌ కేసుకు డిటోనేటర్లకు ఏమైనా సంబంధం ఉందా? లేక మరేదైనా కారణంతో వాటిని అక్కడ ఉంచారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. డిటోనేటర్లను అక్కడ వదిలివెళ్లిన వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు